నలుగురు స్నేహితులు బుక్ బాక్స్ చే తిరిగి చెప్పబడింది ఒకానొక పట్టణానికి దూరంగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో జంతువులు మరియు పక్షులు కలిసికట్టుగా, శాంతియుతంగా సహజీవనం కొనసాగించేవి. ఆ అడవి విడదీయరాని అనుబంధం కలిగిన నలుగురు స్నేహితులకు స్థావరంగా ఉండేది. ఆ స్నేహితులు జింక, తాబేలు, కాకి ఇంకా ఎలుక. ప్రతి సాయంత్రం ఆ నలుగురు స్నేహితులు కలుసుకొని ఆ రోజు జరిగిన సంఘటనల గురించి ముచ్చటించుకొనేవారు. అయితే ఒకరోజున జింక చాలా భయపడింది. “వేటగాళ్లు ప్రతిచోటా వలలు పన్నుతున్నారు తప్పించుకోవడానికి మనం ఏదైనా చేయగలమా?” “చెయ్యగలం!” అని కాకి బిగ్గరగా అరిచింది. “మన స్నేహితుడు ఎలుకకు తెలుసు!” కాకి తాను చూసిన సంఘటనలను చెప్పడం ప్రారంభించింది. “ఇది వరకు ఒక రోజు, నేను ఆశ్చర్యం కలిగించే సంఘటనను చూశాను. ఒక పావురాల గుంపు ఒక వేటగాని వలలో చిక్కుకొనిపోయాయి. వాటి రెక్కలు పెద్దగా కొట్టుకొనసాగాయి. అప్పుడు, ఉన్నపళంగా అవన్నీ కలిసి తమ ముక్కులతో వలను పట్టుకొని ఎగిరిపోయాయి. ఆ పావురాలు ఎక్కడికి వెళ్లాయి? ఏకంగా మన మిత్రుడు ఎలుక వద్ద వాలాయి! తన పదునైన దంతాలతో ఎలుక వలను ఛిద్రం చేసింది. చివరకు వల నుండి బయటపడ్డ పావురాలు ఎగిరిపోయాయి. ఆ పావురాలన్నీ మన స్నేహితుడికి ఎంతో కృతజ్ఞత వెల్లడించాయి.” కథ పూర్తి అయిన తర్వాత, జింక నీటిని వెదకడానికి వెళ్లింది. ఇదిలా ఉండగా, మిగతా ముగ్గురు స్నేహితులు అడవిలోని పండ్లను, పొదరిండ్లను, ఆకులను రుచి చూడడం ప్రారంభించారు. రాత్రి చాలా సేపు అవీ ఇవీ మాట్లాడుకొంటూ, జింక తిరిగి రావడానికై ఎదురుచూడసాగారు. అయితే జింక తిరిగి వచ్చే ఆనవాళ్లు కనిపించలేదు. దీనితో స్నేహితులకు విచారం పెరిగింది. ఉదయం కాగానే, మిగతా వారు జింకను పిలువసాగారు, కాకి దాన్ని వెదుకుతూ అన్ని దిక్కులకూ వెళ్లింది. అలా వెదుకుతున్న కాకి ఒకచోట వలలో తన కాలు చిక్కుకొన్న జింకను చూసింది. “నువ్వేం దిగులు పడకు” అని కాకి జింకకు నెమ్మదిగా చెప్పింది “ఏదో ఒక మార్గం ఆలోచిస్తాం.” కాకి తన స్నేహితుల వద్దకు తిరిగివచ్చింది తాబేలుకు ఒక ఉపాయం తట్టింది. “ఎలుకా, నీవు వెంటనే కాకి వీపుపై ఎక్కు.” అంది. వెంటనే అవి జింకను రక్షించడానికై ఎగిరి వెళ్లాయి. సమయం వృథా చేయకుండా, ఎలుక వలను కొరికివేసింది. అప్పుడే ఆరాటపడుతున్న తాబేలు అక్కడికి చేరుకుంది. “నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు వేటకాడు తిరిగి వస్తే, నీవు ఎప్పటికీ తప్పించుకోలేవు,” అని జింక ఆదుర్దా వ్యక్తం చేసింది. అంతే! వేటకాడు రానే వచ్చాడు. వేటగాని అడుగుల చప్పుడు విని వారందరూ తప్పించుకొని వెళ్లారు. అయితే తాబేలు నిదానంగా నడవసాగింది వేటగాడు తాబేలును పట్టుకొని, దాన్ని ఒక కర్రకు బంధించాడు “అయ్యో! ఇది మంచిది కాదు నా కారణంగా, అమాయకమైన తాబేలు కష్టాలలో చిక్కుకొన్నది,” అని జింక అంది. ఉన్నట్టుండి, జింక ఎగిరి గంతేసి దారి పక్కన ఉన్న కొలను వద్దకు పరిగెత్తింది. జింక నిశ్చలంగా నేలపై పడుకొని ఉన్నది. కాకి దాన్ని పొడవసాగింది. వేటకాడు తాబేలును క్రింద పడవేసి జింకను పట్టుకోవడంలో ఉండగా ఎలుక పుటుక్కున త్రాడును తెగకొరికి తాబేలును విడిపించింది. తాబేలు నీటిలో జొరబడగానే, జింక బాణం వలె పరిగెత్తింది. కాకి సులభంగా ఎగిరిపోయింది. వేటగాడు భయంతో వణకసాగాడు. ఒక జంతువు మరణించి మళ్లీ బ్రతికిరావడం అతడు ఎన్నడూ చూడలేదు. అడవిలో దయ్యాలు ఉన్నాయని అతడు ప్రాణభయంతో పరిగెత్తాడు! ఆ నలుగురు మిత్రులు తమ నివాసాలకు తిరిగి వచ్చి మళ్లీ కలిసికట్టుగా సంతోషంతో కాలం గడిపారు.
BookBox
Our mission is to produce animated stories that are powered by Same Language Subtitling (SLS) a scientifically tested and proven approach to help improve reading skills and language learning, ultimately promoting a love for reading.
AniBooks flow from a simple fact – children love to watch cartoons. Thus, AniBooks are animated stories for children, with the narration appearing on-screen as Same Language Subtitles (SLS). BookBox was founded in 2004 after winning a business plan competition at Stanford University, called, the Social e-Challenge.